Jun 17,2024 20:56

కడప నగర సమస్యలను పరిష్కరించండి
ఎమ్మెల్యే మాధవికి అభ్యుదయ వేదిక విజ్ఞప్తి
ప్రజాశక్తి – కడప అర్బన్‌
కడప శాసనసభ నియోజకవర్గానికి నూతనంగా శాసన సభ్యురాలిగా ఎన్నికైన మాధవిని కలిసి అఖిల భారత అభ్యుదయ వేదిక జిల్లా నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు కడప నగరంలో నెలకొన్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో కడప నగరాన్ని మంచి ప్రగతి పథంలో నిలుపగలరని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ కడప నగర అభివద్ధి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రణాళికా బద్ధంగా తనవంతు కషిచేసి కడప నగరాన్ని ప్రగతి పథంలో నిలుపుతానని అన్నారు. అందరి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేను కలిసి అభినందించిన వారిలో అభ్యుదయ వేదిక రాష్ట్ర నాయకులు కె.సురేష్‌ బాబు, జిల్లా అధ్యక్షుడు బి. విశ్వనాథ, ప్రధాన కార్యదర్శి పి.శంకరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు యస్‌.మహబూబ్‌ బాషా, పి. హైదర్‌ అలీ, కె.గౌరీశంకర్‌, బి.కష్ణ పాల్గొన్నారు.బొకే అందజేస్తున్న సురేష్‌ బాబు

➡️