ఇవిఎం భద్రత ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌, జాయింట్‌ కలెక్టర్‌ సి.గణేష్‌ కుమార్‌ శనివారం పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఇవిఎం బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మౌలానా అజాద్‌ ఉర్దూ నేషనల్‌ యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌పి, జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎస్‌వి కష్ణారావు, కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్‌, ఎఆర్‌ డిఎస్‌పి మురళీధర్‌, రిమ్స్‌ పిఎస్‌సి ఐ కె. రామచంద్ర, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు : ఎస్‌పి జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ శనివారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్‌ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్క డెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఎస్‌పి ఆదేశాలిచ్చారు. కౌంటింగ్‌ నేపథ్యంలో జూన్‌ నెల 1 నుంచి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజ యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గహనిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేస్తా మని పేర్కొ న్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్‌ బెయిల బుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్‌, ఎస్‌.బి. ఇన్‌స్పెక్టర్‌ జి.రాజు, వన్‌ టౌన్‌ సిఐ సి.భాస్కర్‌ రెడ్డి, నగరంలోని సిఐలు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.

➡️