లీజు పేరుతో స్థలం దారాదత్తం

– బిషప్‌ ఇంటి ముట్టడిస్తాం
– ఫాస్టర్లు, ప్రజాసంఘాల నాయకులు
ప్రజాశక్తి – కడప అర్బన్‌
సిఎస్‌ఐ గ్రౌడ్‌, స్కూల్‌ స్థలాన్ని లీజు పేరుతో ఇతరులకు దారాదత్తం చేయడం గర్హనీయమని, బిషప్‌ తీరుకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఫాస్టర్లు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం సిఎస్‌ఐ స్కూల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్లు ఐక్యతరావు, దేవసహాయం, జాకోబ్‌ ఫ్రాంక్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు నారాయణ, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్‌.వి.ప్రసాద్‌, బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు గుర్రప్ప మాట్లాడుతూ ఇప్పటికే సిఎస్‌ఐ ఆస్తులు అన్యాక్రాంతమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రౌండ్‌ స్థలాన్ని ఇతరులకు లీజు పేరుతో విక్రయించారని, ఇప్పుడు స్కూల్‌ స్థలాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. లీజుపేరుతో బిషప్‌ స్థలాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణ పనులకు గుంతలు కూడా తీశారని చెప్పారు. ఈ విషయంలో పోరాటాలకు సిద్దమవుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెవరెండ్‌ కె.సుబుద్ది, కె.ప్రభాకర్‌, ట్రస్టు సభ్యులు బండి రవికుమార్‌, భాస్కరరావు, రాజన్న, ఏసురత్నం, సిఎస్‌ఐ సెంట్రల్‌ చర్చి సభ్యులు కరుణాకర్‌, లోక్‌ సత్తా అధ్యక్షులు దేవకృష్ణ, జర్నలిస్టు అంజి, దూదేకుల సంఘం నాయకులు రసూల్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️