అంగన్‌వాడీల విజయోత్సవ సభ

Jan 28,2024 23:16
తమ హక్కుల సాధన

ప్రజాశక్తి – తాళ్లరేవు

తమ హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేసిన అంగన్‌వాడీలు ఆదివారం మండలం లో విజయోత్సవ సభను నిర్వహిం చారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ప్రజాసంఘాల మండల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ నాయకురాలు ఆదిలక్ష్మి మాట్లాడుతూ 42 రోజులపాటు సిఐటియు ఆధ్వ ర్యంలో సాగిన సమ్మె విజయం సాధించడంలో తమతోపాటు, ప్రజలు సహకరించారని అన్నారు. తమ ఉద్యమానికి సహకరించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె కాలంలో తాము పెట్టిన 12 డిమాండ్లలో 11 డిమాండ్లు సాధించుకోవడం గొప్ప విజయమని అన్నారు. సాధించుకున్న డిమాండ్లను నిలుపుకోవడానికి సంఘం సభ్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. అంగన్‌వాడీల చేపట్టిన సమ్మె చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్‌.రమణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఉంగరాల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు దీపుడు, తణుకురాజు, మహిళా సంఘం నాయకురాలు వై.అప్పాయమ్మ, యూనియన్‌ నాయకులు ఉషారాణి, పార్వతి, నిర్మల, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️