అల్లిపూడిలో ‘మీ ఇంటికి మీ దివ్య’

Mar 8,2024 22:15
అల్లిపూడిలో 'మీ ఇంటికి మీ దివ్య'

ప్రజాశక్తి-కోటనందూరు టిడిపి తుని నియోజకవర్గ అభ్యర్థి యనమల దివ్య అల్లిపూడి గ్రామంలో అంకమ్మ రెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను పత్రాలను ప్రజలకు వివరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివద్ధి పరుస్తానని తాండవ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తానని, వీధి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు సోడిశెట్టి గణేష్‌, టిడిపి నాయకులు అంకమరెడ్డి గోపి, రుత్తల శ్రీనివాస్‌, కొండబాబు, నెమ్మది సత్యనారాయణ, యనమల శివరామకృష్ణ, గాడి రాజబాబు, అంకమ్మ రెడ్డి రమేష్‌, వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవ రాజు, షేక్‌ నవాజ్‌ జానీ పాల్గొన్నారు.

➡️