ఇరిగేషన్‌ నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు

Jan 24,2024 22:51
తమ గ్రామ శివారు

ప్రజాశక్తి – తాళ్లరేవు

తమ గ్రామ శివారు ప్రాంతాల్లో ఆయకట్టులోని పంటలు ఎండి పోవడానికి ఇరిగేషన్‌, ఒఎన్‌ జిసియే కారణమని పలు వురు రైతులు విమర్శం చారు. రెండవ పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్న నీటి పారుదల శాఖ అధికా రులు తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు సూరంపూడి శ్రీనివాస్‌, బాదం ఏడుకొండలు, పిల్లి వీరనాగు, బాదం సత్యనారాయణ కొప్పిశెట్టి రవి, కుడిపూడి శ్రీను, మేడిశెట్టి వీరభద్రరావు, పిల్లి శ్రీనివాస్‌, కుడిపూడి బాబి, శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పి. మల్లవరం, పత్తి గొంది పంట కాలువ శివారు ఉన్న సుమారు 200 ఎకరాల్లో పంట ప్రతీ ఏడాది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోతుందని అన్నారు. ఒఎన్‌జిసికి అవసరమైన నీటిని ఎప్పటికప్పుడు తరలించుకు పోతున్నారని, పంట పొలాలకు సాగు నీరు ఇచ్చిన తరువాతే నీటిని తీసుకెళ్లామన్నా ఒప్పందాన్ని ఒఎన్‌జిసి విస్మరిస్తుందని తెలిపారు. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు ఇంజన్ల ద్వారా తోడుకుందామన్న ప్రధాన పంట పంట కాలువకు చుక్కనీరు రావడం లేదన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ అధికారులు, ఒఎన్‌జిసి అధికారులు చర్చించి తక్షణమే ఆ పైపులైన్‌ ద్వారా శివారు పంట భూములకు సాగునీరు మళ్లించాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల నీటి పారుదల శాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

➡️