ఒడిగోస్‌కు ఇండియా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Mar 19,2024 23:40
నగరంలోని విజె ఎస్‌ఎంఆర్‌ ఒడిగోస్‌కు ఇండి యా

ప్రజాశక్తి – కాకినాడ

నగరంలోని విజె ఎస్‌ఎంఆర్‌ ఒడిగోస్‌కు ఇండి యా ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభిం చింది. విజెఎస్‌ఎంఆర్‌ ఒడి గోస్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వార వినోద్‌ ఇందుకు సంబం ధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు. బెంగ ళూరు తాజ్‌ హోటల్‌లో ఆది వారం జరిగిన ఇండియా ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ ప్రధానోత్సవంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అమ్రతా రావ్‌ చేతుల మీదుగా ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేసెమెంట్‌ ఇన్సిట్యూట్‌ ఇన్‌ సౌత్‌ ఇండ ియా కేటగిరీలో ఇండియా ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందు కోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సివైఫ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ మూర్తి రాజు విజెఎస్‌ ఎంఆర్‌ ఒడిగోస్‌కు అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం జేస్తూ విలువలతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్లే ఈ అవార్డు లభించదని అన్నా రు. పోస్టల్‌ యూనియన్‌ నాయకులు వార సత్య నారాయణ అభినందించి మరిన్ని అవార్డ్స్‌ రావా లని ఆకాంక్షించారు. అవార్డు గెలుచుకున్న విజెఎస్‌ ఎంఆర్‌ ఒడిగోస్‌ను స్టేట్‌ ఎస్‌సి కార్పొరేషన్‌ చైర్మన్‌ జాంగా గగరిన్‌, వాసిరెడ్డి ఏసుదాస్‌, డాక్టర్‌ పివివి.సత్యనారాయణ, ధర్మరావు, రేఖారెడ్డి, బాలాజీ, జాషువు గిరి, మచ్చ బుజ్జి, జిం విల్సన్‌, డాక్టర్‌ వంశీకృష్ణ రాజా, మోహన్‌ సర్‌, విద్యశ్రీ, విజరు, చిన్న అభినందించారు.

➡️