ఒడిగోస్‌కు గ్లోబల్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

Mar 22,2024 22:16
ఒడిగోస్‌కు గ్లోబల్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

ప్రజాశక్తి-కాకినాడస్థానిక రమణయ్యపేటలో ఎపిఎస్‌పి వద్ద ఉన్న విజెఎస్‌ఎంఆర్‌.ఒడిగోస్‌ బెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ట్రైనింగ్‌ రిక్రూట్‌మెంట్‌ కంపెనీగా గ్లోబల్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు దక్కించుకుంది. దీంతో కంపెనీ కార్యాలయంలో శుక్రవారం అభినందన సమావేశం నిర్వహించరాఉ. ఒడిగోస్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వార వినోద్‌ మాట్లాడుతూ బుధవారం ఢిల్లీ లోని హోటల్‌ రాడిసన్‌ బ్లూలో జాతీయ టూరిజం శాఖ మంత్రి శ్రీపాద ఏసో నాయక్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్మిళ ఈ అవార్డును అందజేశారని తెలిపారు. సివైఫ్‌ డైరెక్టర్‌ మూర్తి రాజు మాట్లాడుతూ సంస్థను ప్రశంసించారు. వార సత్యనారాయణ, డాక్టర్‌ వంశికృష్ణ రాజా, గగారిన్‌, వాసిరెడ్డి ఏసుదాస్‌, డాక్టర్‌ పివివి.సత్యనారాయణ, ధర్మారావు, రేఖ రెడ్డి అబ్రహాం, బాలాజీ, జాషువాగిరి, మచ్చ బుజ్జి, జి.విల్సన్‌, మేరీ జ్యోతి, ఒడిగోస్‌ మేనేజర్‌ శిరీష, ప్రియా, లారా, విజరు పాల్గొన్నారు.

➡️