కాకినాడను కొల్లగొడుతున్న ఎంఎల్‌ఎ

Mar 13,2024 23:27
తమ పాలనలో వచ్చిన

ప్రజాశక్తి – కాకినాడ

తమ పాలనలో వచ్చిన స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా కాకినాడను ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కొల్లగొడుతు న్నాడని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండ బాబు ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక మెయిన్‌రోడ్డు మసీదు సెంటర్లో ఎంఎల్‌ఎ కబ్జా చేసిన స్థలాన్ని ఆయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ టిడిపి పాలనలో నగర సుందరీ కరణలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం టిడిఆర్‌ బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగిం దన్నారు. స్థానిక మసీదు సెంటర్లో రాజా రామ్మో హన్‌రారు రోడ్డుకు వెళ్లే కూడలి ప్రాంతంలో కేడిఆర్‌ బాండ్లు తీసుకుని అదే స్థలంలో వ్యాపార సంస్థకు ఎంఎల్‌ఎ ద్వారంపూడి అద్దెకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎక్కువ రద్దీ ప్రాంతమైన సంత చెరువు నూకా లమ్మ ఆలయాన్ని చేర్చి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణా న్ని చేపట్టి దానిని కోటి రూపాయలకు ఎంఎల్‌ఎ విక్రయించారని విమర్శంచారు. తమ పాలనలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెరుగుతున్న జన జనాభాను దృష్టిలో పెట్టుకుని రోడ్లు విస్తరణ కొనసాగించామని, తాజాగా ద్వారంపూడి అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని రోడ్లను ఆక్రమించి శాశ్వ త కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. నగరం లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. వీటిపై అధికారులు స్పందించకపోతే వచ్చే తమ ప్రభుత్వ పాలనలో వీటిని వెలికి తీస్తామని హెచ్చరించారు. ఈ పర్య టనలో టిడిపి నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, చింతలపూడి రవి, గదుల సాయిబాబు పాల్గొన్నారు.

➡️