చలమలశెట్టికి ఘన స్వాగతం

Feb 14,2024 23:00
కాకినాడ పార్లమెంటుకు

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ పార్లమెంటు నియో జకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన చలమశెట్టి సునీల్‌ జిల్లాకు వచ్చిన సందర్భంగా వైసిపి శ్రేణులు ఘనగా స్వాగతం పలికారు. గండేపల్లి చలమలశెట్టి సునీల్‌కు జగ్గంపేట నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ తోట నరసింహం ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు మురారి గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎంపిపి చెలగల దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేటకు వచ్చారు.రాబోయే ఎన్ని కల్లో కాకినాడ పార్లమెంటు నియోజక వర్గంలోని అన్ని స్థానాల్లో వైసిపి విజయం సాధించేం దుకు కృషి చేద్దామని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ చలమలశెట్టి సునీల్‌ అన్నారు. జగ్గంపేట చలమలశెట్టి సునీల్‌కు జగ్గంపేటలో వైసిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటుకు గతంలో నేను పోటీ చేసి ఓడిపోయిన, సిఎం జగన్‌ నన్ను పిలిచి పోటీ చేయమని చెప్పడం జరిగిందన్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానమే నన్ను మరోసారి పోటీ చేయిస్తుందన్నారు. వై నాట్‌ 175 లక్ష్యంగా పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలను గెలుచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఒమ్మి రఘురామ్‌, అత్తలూరి సాయిబాబు పాల్గొన్నారు. అన్నవరం కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ చలమలశెట్టి సునీల్‌కు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఎర్రవరం చేరుకున్న ఆయనకు వైసిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఇన్‌ఛార్జ్‌గా నియమితులై తొలిసారిగా అన్నవరం సత్యనారాయణ స్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సునీల్‌ విలేకరులతో మాట్లాడుతూ సిఎం జగన్‌ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లోనూ వైసిపి విజయం సాధించడం ఖాయమని అన్నారు. తన పార్లమెంట్‌ నియోజకవరగంలోని అన్ని అసెంబ్లీల్లోనూ వైసిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వరవుల సూరిబ్బాబు, అన్నవరం సర్పంచ్‌ ఎస్‌. కుమార్‌ రాజా, బలువు రాంబాబు, దడాల సతీష్‌, కొండపల్లి అప్పారావు, కొల్లు బాబురావు, ఎస్‌.రాము పాల్గొన్నారు.

➡️