టిడిపిలో చేరిన చైర్‌పర్సన్‌

Mar 30,2024 16:49
ఏళేశ్వరం నగర పంచాయతీ

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ఏళేశ్వరం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి, వైసిపి తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు అలమండ చలమయ్య టిడిపిలో చేరారు. శనివారం హైదరబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో వారు టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సత్యప్రభ, కౌన్సిలర్లు మూదీ నారాయణస్వామి, బొదిరెడ్డి గోపి, పెండ్ర శ్రీను, కోణాల వెంకటరమణ, యండగుండి నాగబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాత్సవాయి సూర్యనారాయణ రాజు, నాయకులు పాండ్రంకి అప్పారావు, రుచి రమేష్‌, అలమండ వీర రాఘవరావు ఉన్నారు.

➡️