తాగునీటి సమస్య రాకుండా చర్యలు

Mar 26,2024 23:32
వేసవిలో తాగునీటి సమస్య

ప్రజాశక్తి – కాకినాడ

వేసవిలో తాగునీటి సమస్య తలెత్త కుండా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లో వేసవి తాగునీటి సరఫరా ప్రణాళికపై గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్‌, పంచాయతీ, ఇరిగేషన్‌, వ్యవసాయం, పొల్యూషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా లోని మంచి నీటి చెరువులు, అందుబాటులో ఉన్న నీరు, రోజువారీ వినియోగం, భవిష్యత్‌ అవసరాలు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎట్టిపరిస్థి తుల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకూండా చూడా లన్నారు. జిల్లాలో ప్రస్తుత అవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తూ కాంప్రెహెన్షివ్‌ ప్రొటెక్టెడ్‌ వాటర్‌ సప్లరు, పైప్‌లైన్‌ వాటర్‌ సప్లరు పథకాలకు సంబంధించిన 22 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపేలా కార్యాచరణ అమలుచేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 10 నాటికి పూర్తి చేయాలని సూచించారు. కాలువల మూసివేతకు ముందు చెరువులను 100 శాతం నింపేందుకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేసే విషయంలో ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకోవా లన్నారు. మంచినీటి సరఫరా స్కీములకు వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. బవివిధ పరిశ్రమల వ్యర్థ పదార్థాలు కాలువల్లోకి విడుదల చేయకుండా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ప్రత్యేక తని ఖీలు చేపట్టాలని తెలిపారు. అత్యవసర పరిస్థితు ల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవా లన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళి కలను అమలు చేయాలని..అరట్లకట్ట చెరువుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామ చంద్రమూర్తి, గ్రామీణ నీటి సరఫ రా శాఖ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు, కమిషనర్‌ జె.వెంకటరావు, వ్యవ సాయ శాఖ జెడి ఎన్‌.విజరుకుమార్‌, డిపిఒ కె.భారతిసౌజన్య, ఎపిఇపిడిసిఎల్‌ ఇఇ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️