ధర్నాచౌక్‌పై 5న అఖిలపక్ష సమావేశం

Jan 29,2024 22:08
కాకినాడ ధర్నా చౌక్‌పై ఫిబ్రవరి 5న అఖిలపక్షం

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ ధర్నా చౌక్‌పై ఫిబ్రవరి 5న అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డిఒ సతీష్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేసే హక్కుని కొనసాగించాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌, సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రాజకీయ, కార్మిక సంఘా లతో కూడిన అఖిలపక్షం నాయకులు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కృత్తికా శుక్లాని కలిసి ధర్నాచౌక్‌ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా స్పష్టమైన హామీ ఇచ్చి రమణరాజు నిరవధిక దీక్షను విరమిం పచేయాలని వినతిపత్రం అందచేశారు. కలెక్టర్‌ తక్షణమే స్పందించి ఆర్‌డిఒ సతీష్‌, డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డిని రమణరాజు చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష శిబిరానికి పంపించారు. దీంతో వారు రమణరాజు, ఇతర అఖిలపక్షం నాయకులతో మాట్లాడి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆర్‌డిఒ కార్యాలయంలో ధర్నా చౌక్‌ అంశంపై చర్చించేందుకు అఖిలపక్షంతో సమా వేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రమణరాజుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమిం పచేశారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణ రాజు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దువ్వా శేషబాబ్జి, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీ నర్‌ నరాల శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలను, ధర్నాలను, ఆందోళనలను నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్ట వ్యతిరేకమైన జీవో నెంబర్‌ ఒకటి రాష్ట్ర హైకోర్టు బేషరతుగా కొట్టి వేసిందన్నారు. అయినా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద అనధికారికంగా ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారని, తక్షణమే జిల్లాలోని ప్రజా సంఘా లకు, కార్మిక, ఉద్యోగ సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ము ఖ్యంగా సామాన్య ప్రజానీకానికి నిర సన తెలియ జేసేలా కలెక్టరేట్‌ వద్ద కొనసాగిం చాలని డిమాండ్‌ చేశారు. నిషేధ ఉత్తర్యులను రద్దుచేసి వరకు ఈ పొరాటం కోసాగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గంగ సూరి బాబు, బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు మాతాపు సుబ్ర మణ్యం, ఆర్‌పిఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, దళిత ఉద్యమ సీనియర్‌ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజ్యాధికార పార్టీ నాయకులు రాయుడు మోజెస్‌, ఆర్‌టిఐ జెఎసి రాష్ట్ర అధ్య క్షులు దుర్గారమేష్‌, మాలమహానాడు అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, సిపిఎం నాయకులు అజరు కుమార్‌, ఆప్‌ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ మోహన్‌, రిటైర్డ్‌ పెంక్షనర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు. దీక్ష చేపట్టిన రమణరాజుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు పెద్ధింశెట్టి రామకృష్ణ, సిహెచ్‌. అజరుకుమార్‌ అభినందనలు తెలిపారు.

➡️