నన్నయ యూనివర్శిటీలో అవగాహన సదస్సు

Mar 23,2024 23:30
ఆదికవి నన్నయ యూనివ

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

ఆదికవి నన్నయ యూనివ ర్సిటీలో ‘సస్టైనబుల్‌ యూస్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ ఓట్‌ ఇన్‌ ఏ సస్టైనబుల్‌ డెమోక్రసీ’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వ హించారు. శనివారం జరిగిన ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్‌ ఎస్‌.ప్రశాంతి అధ్య క్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఐ.వెంక టేశ్వరరావు పాల్గొని ప్రస్తుత కాలంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి హక్కులను వర్గాల ఆధారంగా ఏ విధంగా అసమానతలకు గురవు తున్నాయి, ప్రస్తుత కాలంలో యువత యొక్క ఓటు హక్కును ఉపయోగించి భారతదేశ అభివృద్ధిలో ఏ విధంగా పెంపొందించుకోవాలి, అలాగే ప్రాణాధా రమైన ప్రకృతి మనకి ఇచ్చిన నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు అధ్యాపకులు ఆలపాటి శ్రీనివాస్‌ , అధ్యాపకులు డాక్టర్‌ ఎం .పోచయ్య, డాక్టర్‌ ఎం.నానిబాబు, డాక్టర్‌ జోసెఫ్‌ స్టీఫెన్‌, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ విజయశ్రీ, డాక్టర్‌ అప్పారావు, డాక్టర్‌ మధుకుమార్‌, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

➡️