పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన

Feb 21,2024 23:13
జిల్లాలోని అన్ని పోలింగ్‌

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్‌ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓటరు జాబితాల ప్రచు రణ అనంతరం నమోదు, తొలగింపులు, సవరణల కొరకు అందిన ధరఖాస్తుల పరిష్కారం, ఇవిఎంలు, వివిప్యాట్‌ల వినియోగంపై ఓటరు అవగాహనా కార్య క్రమాల నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్‌ వివరిం చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1637 పోలింగ్‌ కేంద్రాలన్నింటిలో ఫర్నిచర్‌, లైటింగ్‌, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కల్పించడం పూర్తయిందని ఆమె తెలిపారు. అలాగే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో డిస్ట్రిబ్యూ షన్‌ కేంద్రాలు, తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. తుని నియోజకవర్గానికి ప్రభుత్వ కళాశాల, ప్రత్తిపాడు నియోజక వర్గానికి మినర్వా డిగ్రీ కళాశాల, పిఠాపురం నియోజక వర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కాకినాడ రూరల్‌ నియోజక వర్గానికి ఆదికవి నన్నయ యూని వర్సిటీ, ఎంఎస్‌ఎన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌, పెద్దాపురం నియోజక వర్గానికి ఎస్‌ఆర్‌విబిఎస్‌జెబి మహారాణి కళాశాల, కాకినాడ సిటీ నియోజకవర్గానికి మెక్లారిన్‌ హైస్కూల్‌, జగ్గంపేట నియోజకవర్గానికి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను కాకినాడ జెఎన్‌టియులో ఏర్పాటు చేయడం జరుగుతుం దన్నారు. జిల్లాలో మొత్తం 386 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు గుర్తించామని, వీటిలో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం పైబడిన శారీ రక వైకల్యం కలిగిన ఓటర్ల కొరకు ఎన్నికల కమిషన్‌ కల్పించిన హోమ్‌ ఓటింగ్‌ వెసులుబాటును ఫారమ్‌-డి ధరఖాస్తు ద్వారా వినియోగించుకునే విధానంపై కలెక్టర్‌ రాజ కీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డి.తిప్పే నాయక్‌, రాజ కీయ పార్టీల ప్రతినిధులు ఆర్‌.వెంకటేశ్వరావు(వైసిపి), గదుల సాయిబాబా(టిడిపి), సిహెచ్‌.రమేష్‌ బాబు (బిజెపి), వి.చంద్రరావు(సిపిఎం), ఎస్‌.అప్పారావు (బిఎస్‌పి), కె.కృష్ణమోహన్‌ (ఆప్‌), ఎన్నికల అధి కారులు ఎం.జగన్నాథం, రామ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️