ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

Mar 4,2024 23:27
ప్రజల నుంచి వచ్చిన

ప్రజాశక్తి – కాకినాడ

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జెసి సివి. ప్రవీణ్‌ ఆదిత్య, జడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి, డిఆర్‌ఒ డి.తిప్పేనాయక్‌, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీ దారుల సమస్యలకు సంబంధించిన ఫోటోలను తప్పని సరిగా పరిష్కార నివేదికలకు జతపరచాలని ఆమె తెలిపారు. రీ ఓపెన్‌ అయ్యే అంశాలపై అధికా రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్య క్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు. అలాగే నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 12 మంది స్థానిక సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్యకూ నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో అదనపు కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసిం హారావు, ఎస్‌ఇ పి.సత్యకుమారి, డిసి గుంటూరు శేఖర్‌, డిసిపి హరిదాస్‌, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, ఇఇ మాధవి, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

➡️