భవితా దీప్తి…బాలోత్సవ స్ఫూర్తి..

Feb 11,2024 22:19
భవితా దీప్తి...బాలోత్సవ స్ఫూర్తి..

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధిచారిత్రక, సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నగరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ‘గోదావరి బాలోత్సవం’ ఆదివారంతో ముగిసింది. రెండు రోజులుగా కళాశాల ప్రాంగణం బాలల కేరింతలతో మారుమోగింది. చివరి రోజు కోలాహలంగా…ఉత్సాహపూరిత వాతావరణంలో బాలోత్సవం ముగిసింది. ముగింపు వేడుక బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షులు విఎస్‌ఎస్‌.కృష్ణకుమార్‌ అధ్యక్షతన జరిగింది. రాజమహేంద్రవరం మాజీ కమిషనర్‌ ఎం.జితేంద్ర, ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్‌, శ్రీవెంకటేశ్వరా ఫైనాన్స్‌ అధినేత వేణుగోపాల్‌, ఎల్‌ఐసి బ్రాంచ్‌ మేనేజర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌.శర్మ, ఎల్‌ఐసి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఆర్‌.రామ్మోహనరావు, ప్రముఖ కవి డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు, సంఘ సేవకులు మాటూరి సిద్ధార్థ, స్వామి యాడ్స్‌్‌ అధినేత భాస్కర్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ చైతన్యశేఖర్‌ తదితరులు మాట్లాడారు. మంచి సమాజాం కోసం అవసరమైన మానవవనరులను అందించేందుకు ఇటువంటి బాలోత్సవాలు అవసరమన్నారు. రాబోయే కాలంలో ఆక్సిజన్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లోకి సమాజం నెట్టబడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతోపాటు, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌.రాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.తులసి రెండు రోజుల కార్యకలాపాలను వివరించారు. 32 విభాగాల్లో 5,600 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్‌, అకడమిక్‌ కార్యక్రమాల నిర్వాహకులు కాశీ విశ్వనాఆథం, కృష్ణకుమార్‌, సాయిబాబా, విజయబాబు, జివిరమణ, ఉపాధ్యాయులు అరుణకుమారి, షరీఫ్‌ తమ అనుభవాలను పంచుకున్నారు. అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. విజేతలకు బహుమతుల ప్రదానం ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభను చాటుకున్న వారికి అతిథుల చేతుల మీదుగా ముగింపు సభలో మెమోంటోలు, మెడల్స్‌ అందించారు. కల్చరల్‌ విభాగంలోని క్లాసికల్‌ డ్యాన్స్‌లో జూనియర్స్‌ విభాగంలో మొదటి బహుమతిని తొర్రేడు బ్లోస్సాం స్కూల్‌ విద్యార్థిని రియాన్షికా రాయుడు సాధించింది. లఘు నాటికలో వేమగిరి జడ్‌పిపి హైస్కూల్‌ విద్యార్థిని కె.జ్ణానశ్రీ, జానపద నృత్యంలో శ్రీసాయి బాలాజీ విద్యానికేతన్‌ విద్యార్థులు ప్రథమ బహుమతిని సాధించారు. కోలాటంలో జయకృష్ణపురం స్విట్జర్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు, విచిత్ర వేషధారణల పోటీలో కాటన్‌ పేట శ్రీశివనంద యుపి ఇంగ్లీషు మీడియం స్కూల్‌ విద్యార్థి పవన్‌ సందీప్‌, జానపద గీతాలాపనలో శ్రీరామ్‌నగర్‌ శ్రీగౌతమి ఇంగ్లీషు మీడియం స్కూల్‌ విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశభక్తి, అభ్యుదయ గీతాలాపనలో శ్రీ గౌతమి ఇంగ్లీసు మీడియం స్కూల్‌ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. అకడమిక్‌ విభాగం కవితా రచనలో కడియపు సావరం మినర్వా ఇంగ్లీషు మీడియం స్కూల్‌ విద్యార్థిని కె.స్వాతిప్రసన్న, కథా రచనలో చెముడులంక నేతాజీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ విద్యార్థి ధనలక్ష్మి, చిత్రలేఖనం జూనియర్స్‌లో రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులం స్కూల్‌ విద్యార్థిని వి.శ్రీవాస్తత్స శ్రావణి, సీనియర్‌ విభాగంలో కాకినాడ పనసపాడు లిటిల్‌ ఉడ్స్‌ స్కూల్‌ విద్యార్థిని సిహెచ్‌.థశ్విక ప్రథమ బహుమతులను గెలుసుకున్నారు. పద్యం-భావం విభాగంలో హుకుంపేట జడ్‌పిపి హైస్కూల్‌ విద్యార్థిని టిహెచ్‌.సత్యవిష్ణు ప్రథమ బహమతిని సాధించింది. ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. అలాగే వివిధ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారికి జ్ఞాపికలు అందించారు. గ విజేతలకు మెమోంటోలు, మెడల్స్‌ను ఎల్‌ఐసి సంస్థ, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్‌, మన్యం నవీన్‌ ఎలక్ట్రానిక్స్‌, కొకోకోల కంపెనీ, ఆర్యవైశ్య అఫీసియల్స్‌ అండ్‌ గ్రడ్యూయేట్స్‌ అసోసియేషన్‌ అందచేశారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులను మెమోంటోలు అందించి సత్కరించారు. నూతనోత్సవాన్ని నింపిన బాలోత్సవం రెండు రోజుల గోదావరి బాలోత్సవం చిన్నారుల్లో నూతనోత్సవాన్ని నింపింది.ఆదివారం అకడమిక్‌, కల్చరల్‌ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అకడమిక్‌ విభాగంలో నిర్వహించిన పోటీల్లో స్పెల్‌బి, కార్టూన్‌, చిత్రలేఖనం పోటీల్లో సీనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో జరిగాయి. వక్తృత్వం పోటీల్లో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలోజూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో నిర్వహించారు. అంతర్జాలంలో అన్వేషణ సీనియర్స్‌ విభాగంలోనూ, పద్యం భావం జూనియర్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కథలు చెప్పడం, మట్టితో బొమ్మలు తయారీ అంశాల్లో పోటీలు ఉత్సాహంగా జరిగాయి. కల్చరల్‌ విభాగంలో జానపద నత్యం విభాగంలో సీనియర్స్‌ పెద్ద ఎత్తున పాల్గొని కళా ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజ్‌ 5 వద్ద సీనియర్‌ భాగంలో క్లాసికల్‌ డ్యాన్స్‌లతో చిన్నారులు ఆకట్టుకున్నారు. లఘు నాటిక, ఏకపాత్రాభినయం విభాగాల్లో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొన్నారు. దేశభక్తి అభ్యుదయ జానపద గీతాలాపనలో తమ తమ ప్రతిభను చాటుకున్నారు. అలాగే సీనియర్స్‌ విభాగంలో బందాలుగా చేసిన కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సీనియర్‌ విభాగంలో విచిత్ర వేషధారణ పోటీల్లో విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేశారు.

➡️