మోకాళ్లపై హమాలీ కార్మికుల నిరసన

Mar 2,2024 23:14
ఎగుమతి కూలి

ప్రజాశక్తి – సామర్లకోట

ఎగుమతి కూలి రేట్లు పెంపుదల కోసం బేవరేజెస్‌ హమా లీలు చేపట్టిన ఆందోళనలో భాగంగా శనివారం స్థానిక డిపో వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూని యన్‌ ప్రధాన కార్యదర్శి వి.అప్పల రాజు మాట్లా డుతూ మద్యం ఎగుమతి, దిగుమతి పనులు ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు సమకూర్చడంలో హమాలీలు కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. అయిన ప్రభుత్వం ద్వారా కూలీలకు ఏవిధమైన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. హమాలీలు దిగుమతి చేస్తున్న ప్పుడు బీర్‌ బోటల్స్‌ పగిలి గాయాలపాలై వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన వస్తుందని తెలిపారు. కార్పొరేషన్‌ నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వచ్చు చాలీ చాలని కూలితో హమాలీ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిలో కార్పొరేషన్‌ కాంట్రాక్టర్‌ను పిలిపించి చర్చలు జరిపి ఎగుమతి కూలి రేట్లు పెంచి హమాలీ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు మాట్లాడుతూ ఎగుమతి కూలి పెంపుకై రాష్ట్ర కమిటి పిలుపు మేరకు 5వ తేదన చలో విజయవాడ ఎండి కార్యాలయానికి హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూని యన్‌ అధ్యక్షులు బి.ఆదినారాయణ, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

➡️