యువతకు ఉపాధి చంద్రబాబుతోనే సాధ్యం

Feb 22,2024 22:24
యువతకు ఉపాధి

ప్రజాశక్తి – కాకినాడ

యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక టిడిపి కార్యా లయంలో గురువారం మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సిబిఎన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో యువతను మోసం చేసి అధికారం చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో యువతకు ఉపాధి కల్పించలేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకురాకుండా, జే-టాక్స్‌ పేరుతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేసాడని విమర్శంచారు. అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పి స్తానని హామీలు ఇచ్చి, ఫిష్‌ మార్కెట్లు, మటన్‌ షాపులో, బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలంటూ యువత భవిష్యత్తును నాశనం చేశాడన్నారు. రాబోయే ఎన్నికల తరువాత టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, తమ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు అవసరమైన ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో యువతీ యువకులు ప్రతీఒక్కరూ మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ చంద్రబాబు నినాదంతో సంసిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్‌ వర్మ, నాయకులు పలివెల రవి, తుమ్మల రమేష్‌, గదుల సాయిబాబా, గాది శివరామకృష్ణ, రహీమ్‌ పాల్గొన్నారు.

➡️