రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

Feb 24,2024 23:37
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి -సామర్లకోటసామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో 56వ అంతర్‌ జిల్లాల ఓపెన్‌ ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి ఊబా జాన్‌ కెనడీ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌ నాయకత్వంలో ఈ పోటీలు మూడు రోజులు పాటు జరగనున్నాయి. పోటీలను వైసిపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు, సుబ్బారావు, ఉండూరు కెటిసి విద్యా సంస్థల నాయకులు ప్రవీణ్‌ చక్రవర్తి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి ప్రారంభించారు. ప్రధాన పోటీలను సాయంత్రం 6 గంటలకు ఫ్లడ్‌ లైట్ల కాంతిలో కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ గోకిన సునేత్ర దేవి, వైసిపి రాష్ట్ర నాయకులు ఆవాల లకీëనారాయణ, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి టిఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌, కార్యదర్శి సీతారామరెడ్డి, జాతీయ కోచ్‌ పోతుల సాయి, వార్డు కౌన్సిలర్‌ పాలిక కుసుమ చంటిబాబు, మున్సిపల్‌ కో అప్సన్‌ సభ్యులు సల్లూరి కళ్యాణ్‌, పిఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్‌ స్టీవెన్‌ కింగ్‌, లింగం శివ ప్రసాద్‌, ఎం వెంకటేశ్వర్లు, ఎండివి.ప్రసాద్‌, పాల్గొన్నారు.

➡️