రోడ్లు వేస్తేనే.. ఓట్లు వేస్తాం..

Jan 26,2024 23:59
రోడ్లు వేస్తేనే.. ఓట్లు వేస్తాం..

ప్రజాశక్తి- తాళ్లరేవుఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎంఎల్‌ఎ సహా పలువురు ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీసిన సంఘటన శాంతమూల గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా పటవల పంచాయితీ శాంతమూల వచ్చిన ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ వద్ద మహిళలు నిరసన తెలిపారు. మహిళలు మాట్లాడుతూ తమ గ్రామానికి రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని అన్నారు. దీనిపై ఎంఎల్‌ఎ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ పటవల, శాంతమూల రహదారికి నిధులు మంజూరు అయ్యాయని ఎన్నికల కోడ్‌ సమీపించనున్న కారణంగా రహదారి పనులు ప్రారంభం కాకపోవచ్చని, మే నెలలో తప్పక రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పార. ఎన్నికలకు ముందే రోడ్లు వేయాలని మహిళలు తేల్చి చెప్పారు. ఎంఎల్‌ఎ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. దీంతో స్థానిక మహిళలు శాంతించారు.

➡️