సంక్షేమ పథకాలకు మంగళం

Feb 29,2024 22:12
వైసిపి

భవన నిర్మాణ కార్మికులకు వైసిపి సర్కారు అన్యాయం
సమస్యల పరిష్కారానికి నేడు ‘చలో కలక్టరేట్‌’
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
రాష్ట్రంలో వైసిపి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అరకొరగానే అందిస్తోంది. సంక్షేమ బోర్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన ఇతర అవసరాలకు దారి మళ్లించి బిల్డింగ్‌ వర్కర్లకు అన్యాయం చేసింది. అనేకసార్లు విన్నవించినప్పటికీ పట్టనట్లు వ్యవహరించింది. ఆందోళనలు చేపట్టినా కనీస స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలను పునరుద్ధరిం చాలని, 1214 మెమో రద్దు చేయాలని, 2019 నుంచి పెండింగ్‌లో పెట్టిన క్లెయిమ్‌ల పరిహారా లను కార్మికుల ఖాతాలకు తక్షణమే జమ చేయాల ని డిమాండ్‌ చేస్తూ కార్మికులంతా శుక్రవారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో 53 రకాల పనులు చేస్తున్న కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గోఉన్నారు.ప్రభుత్వ పథకాలకు దూరంరాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం కారణంగా కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఏ ప్రమాదం జరిగినా వారు, పిల్లలకు వివాహం అయినా సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం పథకాలతో సంబంధం లేకుండా పథకాలు అందేవి. కాని ప్రస్తుతం ప్రభుత్వం పథకాలు ఇస్తున్నామనే పేరుతో సంక్షేమ బోర్డు నుంచి సాయం నిలివేశారు. 100 మంది ఉంటే వారిలో 5 నుంచి 10 మందికి మాత్రమే ప్రభుత్వం పథ కాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. మిగిలిన వారికి ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు. దీంతో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. మళ్లీ జగన్‌ వస్తే తమకు ఉపాధి లేకుండా పోయే పరిస్థి తులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలు కాకపోతే భవన కార్మికులు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. సామాన్యులు భవం తులు కట్టుకుంటేనే కార్మికులకు ఉపాధి చేతి నిండా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్‌ లోన్‌ ద్వారా సామాన్యులు తమ సొంత భవనాలు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కావునా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సహకారం అందించడం ద్వారా ఉపాధి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల జీవితాలు చీకటిలోకి జారుకున్నాయని, ప్రభుత్వమే సష్టించిన ఇప్పటికే ఇసుక సంక్షోభం, కరోనా సంక్షోభం నిర్మాణ రంగాన్ని కుదేలు చేయగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుతో మరింత అంధకారంలోకి కూరుకుపోయారు. ఈనేపథ్యంలోనే మరోసారి ఆందోళనకు సిద్ద పడ్డారు.

➡️