సమాజ అభివృద్ధికి దోహదపడేలా పరిశోధనలు

Mar 27,2024 23:03
సమాజ అభివృద్ధికి దోహద

ప్రజాశక్తి – కాకినాడ

సమాజ అభివృద్ధికి దోహద పడేలా విద్యార్థులు నూతన పరిశోధనలను ఆవిష్కరిం చాలని జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొఫెసర్‌ జివిఆర్‌.ప్రసాద రాజు పిలుపు నిచ్చారు. బుధవారం జెఎన్‌టియుకె డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ డిజైన్‌ ఇన్నోవేషన్‌ సహకా రంతో రెండు రోజులపాటు జరిగే ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ను ఆదికవి నన్నయ యూని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.పద్మ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్క రణలను చేపట్టాలన్నారు. ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్లో విద్యార్థులు చాలా సృజనాత్మ కమైన ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగింద న్నారు. సమాజానికి, రైతులకు ఇతర రంగాలకు ఉపయోగ పడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించా రన్నారు. విద్యార్థులు ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించి సరికొత్త ఆవిష్క రణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నన్నయ విసి ప్రొఫెసర్‌ కె.పద్మరాజు మాట్లాడుతూ ఇటువంటి ఇన్నోవేషన్‌ ఫెయిర్లలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారికి పరిశోధనలపై మరింత ఆసక్తి పెరుగుతుందని, తద్వారా సమాజాభివీద్ధికి తోడ్పడే ఆవిష్కరణలను రూపొందించేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యా లయాలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సృజనాత్మకమైన ఆవిష్కరణలను ప్రదర్శిం చడం అభినందనీయమన్నారు. ఇన్నో వేషన్‌ ఫెయిర్‌లో భాగంగా రాష్ట్రవ్యా ప్తంగా వివిధ కళాశాలల నుంచి 200కు పైగా నమూ నాలను ప్రదర్శించడం జరిగిందని డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎ.గోపాలకృష్ణ అన్నారు. ఈ ప్రదర్శనలో అత్యుత్తమైన నమూనాలకు నగదు బహు మతులను అందజేయడం జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్ను నగర ప్రజలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఉచితంగా సందర్శించవ చ్చుని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెర్‌ ఎల్‌.సుమలత, ఓఎస్‌ ప్రొఫెసర్‌ డి.కోటేశ్వరరావు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.కళ్యాణ మనోహర్‌ డైరెక్టర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, విభాగాధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️