సిద్ధం సభకు తరలిన వైసిపి శ్రేణులు

Feb 3,2024 23:36
ఏలూరులో సిఎం

ప్రజాశక్తి – యంత్రాంగం

ఏలూరులో సిఎం జగన్మోహన్‌ రెడ్డి సిద్ధం సభకు శనివారం జిల్లా నుంచి పెద్దఎత్తున వైసిపి శ్రేణులు తరలివెళ్లాయి. రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల నుంచి ఏలూరు సభకు వైసిపి శ్రేణులు తరలివెళ్లాయి. మండల కేంద్రమైన రౌతులపూడిలో జడ్‌పిటిసి గొల్లు లక్ష్మణమూర్తి, వాసిరెడ్డి జమీలు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. శంఖ వరం శంఖవరం మండల వైసిపి అధ్యక్షుడు పర్వత రాజబాబు సారధ్యంలో వివిధ గ్రామాల నుంచి వైసిపి శ్రేణులు ఏలూరు సిద్ధం సభకు తరలివెళ్లారు. కిర్లం పూడి కిర్లంపూడిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వాహనాలకు వైసిపి నాయకుడు దాడి చిన్నబుజ్జి జెండా ఊపి ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు సారధ్యంలో వైసిపి శ్రేణులు తరిలి వెళ్లాయి. కాజులూరు జడ్‌పిటిసి సభ్యు లు వనుము వెంకట సుబ్బారావు, ఎంపిపి మాత భారతి ఆధ్వర్యంలో పలు గ్రామాల నుంచి వైసిపి శ్రేణులు బయలుదేరిన బస్సులకు సర్పంచులు జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట రూరల్‌ స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నియోజక వర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌ తోట నరసింహం ఏలూరు సిద్ధం సభకు వెళ్లే వాహనా లకు జెండా ఊపి ప్రారం భించారు. ఈ కార్య క్రమంలో నాయకులు ఒమ్మి రఘు రాం, జాన్‌ వెస్లీ, తోట రాంజీ, అత్తులూరి సాయిబాబు, పెద్దాడ రాజబాబు, గఫూర్‌, తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు స్థానిక చెరువు సెంటర్‌ వద్ద ఏలూరు సిద్ధం సభకు తరలివెళ్లే వాహనాలకు ఎంపిపి రాయుడు సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కుడుపూడి శివన్నా రాయణ, నాయకులు రాయుడు గంగాధర్‌, కాదా గోవింద కుమార్‌, కొప్పిశెట్టి వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు. కరప ఎంపిపి పెంకి శ్రీలక్ష్మీ, జడ్‌పిటిసి సభ్యులు వై సుబ్బారావు, చింతా ఈశ్వరరావు, బండే పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల నుంచి సిద్ధం సభకు తరలివెళ్లారు.

➡️