సేవలు సరే…నిర్వహణ ఎలా.?

Feb 6,2024 22:58
ప్రభుత్వ సేవలను ప్రజలకు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్నా లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రారంభంలో ఉచితంగానే సేవలు అందించింది. కొద్దికాలం అనంతరం రుసుములతో కూడిన సేవలను ప్రారంభించింది. ఇందు కోసం సచివాలయ సిబ్బందిని నియమించింది. అయితే ఈ సచి వాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కేటా యించలేదు. దాంతో స్టేషనరీ బిల్లులు సహా కొన్నిచోట్ల ఇంటర్నెట్‌ బిల్లు లు సైతం చెల్లించడానికి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతు న్నారు. పలుచోట్ల పంచాయతీలపైనే ఈ భారం పడుతుంది. ఇప్పటికే ఆయా పంచాయతీలు ఇప్పటికే ఆర్థిక భారంతో సతమతమవు తున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయాల నిర్వహణ భారాన్ని భరిం చలేక పంచాయతీల కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్లయితే సచివాయల సిబందే తమ జేబుల్లో సొమ్ములను ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 2019 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 319 వార్డు, 1271 గ్రామ సచివాలయాలు మొత్తంగా 1590 సచివాలయాల్లో 18 విభాగాల్లో 13,650 పోస్టులు మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న కొన్ని సచివా లయాలకు మూడు నెలలకు ఒకసారి రూ.1500 మాత్రమే అరకొర సొమ్ములు ఇస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదని ఉద్యో గులు గగ్గోలు పెడుతున్నారు. ఇవి కూడా పాత బకాయిలు అంటూ గత ఏడాది జూన్లో మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. సచివాలయ సిబ్బంది నిర్వహణ ఖర్చులు పేరుతో పంచాయతీలకు బిల్లులు పెడుతున్నారు. నిధులు అందుబాటులో ఉంటే పంచాయతీలు కొన్ని చోట్ల ఇస్తున్నారు. చాలా పంచాయతీలు నిధుల సమస్య వెంటాడుతుండడంతో స్టేషనరీ కొనుగోలు కోసం సిబ్బంది అరువు పెడుతున్నారు. సామాగ్రి కొనుగోలు, ప్రింటర్ల నిర్వ హణ, ఇంటర్నెట్‌, కరెంటు బిల్లులు, సంక్షేమ పథకాల లబ్ధిదా రులకు ప్రింటింగ్‌ తీసే పేపర్లు ఇలా పలు అవసరాల కోసం ఖర్చులు పెరిగి పోతున్నాయి. వీటి కోసం పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘాల నిధులను ఖర్చు చేస్తున్నాయి. చిన్న పంచాయతీలకు ఈ ఖర్చుల భారం ఎక్కువగా ఉంటుంది. పారిశుధ్య సిబ్బంది జీతాలు, వీధి దీపాల నిర్వహణ వంటి అవసరాల కోసం ఇబ్బందులు పడాల్సి వ స్తుంది. దానికి తోడు సచివాలయాల నిర్వహణకు కూడా వీటిపైనే ఆధారపడుతున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభత్వుం నిర్వహణ ఖర్చులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని సచివాలయ సిబ్బంది కోరుతున్నారు.

➡️