స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలి

Mar 30,2024 18:06
స్వాతంత్య్ర ఉద్యమ

ప్రజాశక్తి – కాకినాడ

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో విద్యా విధానాలపై పోరాటాలు సాగించాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రాజశేఖర్‌ పిలుపు నిచ్చారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక యుటి ఎఫ్‌ హోమ్‌లో జిల్లా విద్యా, వైద్యానిక శిక్షణ తరగ తులు 2వ రోజు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వరహాల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘మతం’ అనే పాఠ్యంశంపై రాజశేఖర్‌ బోధించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో నేటి విద్యార్థినీ, విద్యార్థులు విద్యారంగ విధానాలపై పోరాడాలని పిలుపుని చ్చారు. మనుషుల మధ్య మానవత్వం కలిగి ఉండాల ని, మతం పేరుతో విద్యార్థులు విచ్ఛిన్నం కాకూడదని కోరారు. భారతదేశాన్ని 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిష్‌ వాళ్ళకి వ్యతిరేకంగా భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌, అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్ర బోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, గాంధీ వంటి ఎందరో వ్యక్తులు తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని అన్నారు. అదే స్ఫూర్తితో దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచితంగా విద్యను అందించడం కోసం, అందరికీ విద్యా ఉపాధి కోసం పోరాడాలని కోరారు. విద్యార్థులు నేటి సమాజంలో మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. మతం వ్యక్తిగతంగా ఉండాలని, మతతత్వవాదులను, మతా న్ని విద్యారంగంలో చొప్పించే విధానాలను విద్యార్థులు తిప్పికొట్టాలని అన్నా రు. అలాగే స్వాతంత్రోద్యమంలో విద్యార్థుల పాత్ర అనే పాఠ్యంశాన్ని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర ఉపా ధ్యక్షులు టి.రాజా బోధించారు. ఈ తరగతుల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, జిల్లా నాయకులు వాసు, సిద్దు, గోపాల్‌, లోవరాజు, చిన్ని, అమృత, పావని, కృప ,సిరి, సుబ్రహ్మణ్యం, కరుణాకర్‌, విశాల్‌ పాల్గొన్నారు.

➡️