104 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

Jun 17,2024 22:42
సమస్యలను పరిష్కరించేందుకు

ప్రజాశక్తి – సామర్లకోట

సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామిని 104 సిబ్బంది కోరారు. 104 ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) కాకినాడ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాటల రాంబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షులు పి.శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి ఎం.త్రిమూ ర్తులు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెంకట్రావు, కోశాధికారి శ్రీనివాస్‌, తేజ, హరిప్రసాద్‌, మిత్ర తదిత రులు సోమవారం రామస్వామికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి 104 సిబ్బంది సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

➡️