16న దేశవ్యాప్త బంద్‌

Feb 6,2024 23:00
మోడీ ప్రభు త్వం

ప్రజాశక్తి – కాకినాడ

మోడీ ప్రభు త్వం అనుసరిస్తున్న రైతాం గ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగు తున్న దేశవ్యాప్త బంద్‌ను జయ ప్రదం చేయాలని కేంద్ర కార్మిక, రైతు సం ఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యా లయంలో ఐఎన్‌టియుసి తెలుగు రాష్ట్రాల కార్య నిర్వాహక కార్యదర్శి తాళ్లూరి రాజు అధ్యక్షతన మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబి రాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజ బాబు మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టు బాటు ధర చట్టం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసు కొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనే డిమాండ్లతో బంద్‌ జరుగుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుం డా పంట రుణాలు, గుర్తింపు కార్డులు, పంట నష్టం అందించాలని కోరారు. మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 10 ఏళ్ల సమయంలో పేదరికం 30 శాతం పెరిగిందని, కరోనా కంటే ముందే దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబ డిందని, పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడి పోయిందని, నిరుద్యోగం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిం దని అన్నారు. 75 ఏళ్లుగా ప్రజల సంపదతో నిర్మిం చుకున్న సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్ప గించడమే లక్షంగా మోడీ విధానాలు పనిచేస్తున్నా యని విమర్శించారు. ఈ బందులో ఉద్యో గులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యా పారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 8న కాకి నాడలో విస్తృత స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వ హించాలని, 9,10 తేదీల్లో పరిశ్రమలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, వ్యాపార సంస్థలకు బంద్‌ నోటీసులు అందించాలని, 13, 14 తేదీల్లో ఆటో ప్రచారం నిర్వ హించాలని, 16న బంద్‌ జరిగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ కార్మిక, రైతు సంఘాల నాయకులు అంజిబాబు, దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌, మలకారమణ, రొంగల ఈశ్వరరావు, రాజా, ఎం.వెంకటరమణ, పాల్గొన్నారు.

➡️