2వ రోజు శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 1,2024 22:36
2వ రోజు శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన గురువారం 2వ రోజు కొనసాగింది. యూనియన్‌ నాయకులు డి.దుర్గాప్రసాద్‌, సిహెచ్‌.పుష్ప మాట్లాడుతూ 2021 నుంచి జిజిహెచ్‌లో శానిటేషన్‌ నిర్వహణ కాంట్రాక్టు పొందిన కృష్ణా కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా పిఎఫ్‌ చెల్లింపుల్లో యజమానులు చెల్లించాల్సిన వాటా కూడా కార్మికుల జీతాల నుంచి కత్తిరిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేసేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, యూనియన్‌ నాయకులు జె.లకీëప్రియ, ఎస్‌.వాసు, కృష్ణవేణి, రమణమ్మ, తలుపులమ్మ, భాగ్యలక్ష్మి, బి.శ్రీకాంత్‌, ఎం.ఏసు, ఎం.రవి, వసంత్‌, జనార్ధన్‌ పాల్గొన్నారు.

➡️