ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో 83.09 శాతం ఉత్తీర్ణత

Apr 22,2024 23:50
10వ తరగతి ఫలితాల్లో

ప్రజాశక్తి – కాకినాడ

10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు 83.09 శాతం ఉత్తీర్ణత సాధించారని డిఇఒ పిల్లి రమేష్‌ తెలిపారు. సోమవారం విద్యా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలకు 27,671 మంది విద్యార్థులు హాజరు కాగా 22,993 మంది పాసయ్యారని వీరిలో బాలురు 10,958 మంది, బాలికల 12,035 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పార్వతీపురం మన్యం, రెండో స్థానం శ్రీకాకుళం, మూడో స్థానం కడపకు, 26వ స్థానం సత్య సాయి జిల్లాకు దక్కిందన్నారు. కాకినాడ జిల్లా 22వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఉత్తీ ర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతుల ను నిర్వ హిస్తామని చెప్పారు. పరీక్ష పాస్‌ కాని విద్యార్థులకు మే 24న సప్లమెంటరీ పరీ క్షలను నిర్వహి స్తామని తెలి పారు. ఈ నెల 23 నుంచి 30 వరకు, ఆలస్య రుసుం తో మే ఒకటి నుంచి 23 వరకు ఫీజులు కట్టించుకుంటామని చెప్పారు. 83.09 శాతం ఉత్తీర్ణత సాధించిన పట్ల కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.

➡️