94.76 శాతం ఉత్తీర్ణత

Apr 22,2024 23:52
మండలంలో 10వ తరగతి

ప్రజాశక్తి – కాజులూరు

మండలంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 94.76 శాతం ఉత్తీర్ణత సాధిం చారని ఎంఇఒ వివేకనంద తెలిపారు. సోమ వారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, ఎస్‌డివిఆర్‌ఆర్‌ ఎయిడెడ్‌ పాఠశాల, 5 ప్రయి వేట్‌ పాఠశాలల నుంచి 630 మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరుకాగా 593 మంది విద్యా ర్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. గొల్లపాలెం జడ్‌పి పాఠశాలకు చెందిన విద్యా ర్థిని అనసూరి జయశ్రావణికి 571 మార్కులు రాగా, కాజులూరు జడ్‌పి పాఠశాల చెందిన విద్యార్థిని కోన ఉమాలలితాంబ 570 మార్కు లు సాధించిందని తెలిపారు. మంజేరు జడ్‌పి పాఠశాల, ఐదు ప్రయివేట్‌ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తిర్ణత సాధించినట్లు తెలిపారు.

➡️