నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

Apr 15,2024 23:17
జిల్లావ్యాప్తంగా

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లావ్యాప్తంగా ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ వుతుందని, నామినేషన్ల స్వీకరణలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గానికి కాకినాడ కలెక్టరేట్‌లోని ఆర్‌ఒ కార్యా లయంలో నామినేషన్ల స్వీకరిస్తారన్నారు. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్‌ అధికారులు ఫామ్‌-1 నోటిఫికేషన్‌ను ఈనెల 18న విడుదల చేస్తారన్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకూ ప్రభుత్వ సెలవులు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామి నేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 26న నామినేషన్ల స్క్రూటిని నిర్వహిచడం జరుగుతుందన్నారు. 29 వరకు నామి నేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంద న్నారు. ఉపసంహరణ అనంతరం పోటి లో నిలిచిన అభ్యర్థులను ఫామ్‌-7ఎ ద్వా రా ప్రకటిస్తామన్నారు. మే 12న పోలింగ్‌ సిబ్బందికి ఇవిఎంలు, వివి ప్యాట్‌లు, స్టేషనరీ ఇతర పోలింగ్‌ సామాగ్రి అందజేస్తామని, ముందుగా నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌ మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని వాహనాల్లో పంప నున్నట్లు ఆయన తెలిపారు. మే 13న పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఓటింగ్‌ శాతం పెంచడమే ప్రధాన లక్ష్యం..జిల్లాలో గతానికి కంటే ఎక్కువగా ఓటింగ్‌ శాతం పెంచడమైన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఏపిక్‌ కార్డుతోపాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఇసిఐ గుర్తింపు పత్రాలు గల పాత్రికేయులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కల్పించ నున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలి పారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తుంటే ఆధారాలు తప్ప నిసరిగా చూపాలన్నారు. జిల్లాలో 8 చెక్‌ పోస్టుల తోపాటు ఎస్‌ఎస్‌టి, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.

➡️