సమస్యల పరిష్కారం కోసం రెండో రోజుకి అంగన్వాడీలు సమ్మె

Dec 13,2023 11:25 #Kakinada
anganwadi protest 2nd day kakinada

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వాదిక సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. కాకినాడ ఇంద్ర పాలెం లాకులు వద్ద కాకినాడ అర్బన్, రూరల్, పెదపూడి, కరప మండలాలకు చెందిన అంగన్వాడీలు వందల సంఖ్యలో బుధవారం కూడా సమ్మె శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.చంద్రావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడిచిపెట్టి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీను అమలు చేయమని అడుగుతుంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలకు పిలిచి బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. శక్తికి మించి పనిచేస్తున్నా అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందిస్తున్న తామంతా ఇబ్బందులకు గురవుతున్నామని, విధలేని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

➡️