కోటి సంతకాలకు అంగన్వాడీల పిలుపు

Jan 12,2024 16:25 #Kakinada
anganwadi workers strike 32nd day in kkd

ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడి డిమాండ్లపై ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణకు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లా 24గంటల రిలే నిరాహార దీక్షల శిబిరంలో సంతకాల కార్యక్రమాన్ని ఐడియల్ కాలేజీ కరస్పాండెన్స్ చిరంజీవిని కుమారి మొదటి సంతకంచేసి ప్రారంభించి మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యమం విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత మార్గంలో అంగన్వాడీలు చాలా పట్టుదలతో నెలరోజుల నుండి నిర్వహిస్తున్న ఉద్యమాన్ని కొనియాడారు. మీరు మహిళలు కాదు, మహాశక్తివంతులని నిరూపిస్తూన్నారన్నారు. ఈ ఉద్యమం వర్గ పోరాటాలకు సారధ్యం వహిస్తుందని, భవిష్యత్తు ఉద్యమాలను ఎలా నిర్వహించాలో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సదేహంలేదన్నారు. ధరల పెరుగుదలతో, చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకమంతా అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షా శిబిరానికి కాకినాడ రూరల్, అర్బన్ అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు వీరమణి, సరోజిని, చామంతి, విజయ, సుధా, భవాని, సునీత, సుజాత, జోగమ్మ, వరలక్ష్మి, వ్యాపారమ్మ, రాధా, సునీత, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరానికి సమగ్రశిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు మహాలక్ష్మి, రాజు, గంగాధర్, సత్యనాగమణి, కిరణ్, చంటిబాబు .ఐద్వా నాయకులు భవాని, చెక్క రమణి, జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.ఎం.ఎం.ఆర్. ప్రసాద్, వర్మ, రిటైర్ అంగన్వాడీ టీచర్ వరహాలక్ష్మి ఆర్ధిక సహాయం చేసి మద్దతు తెలియజేసారు.

➡️