పిల్లలతో భిక్షాటన చేయిస్తే శిక్షలు తప్పవు

Mar 11,2024 15:42 #Kakinada

అధికారుల బృందం హెచ్చరిక
ప్రజాశక్తి-సామర్లకోట : రైల్వే స్టేషన్లు బస్టాండ్ లో దేవాలయాలు ప్రధాన కుడలిల వద్ద వీధి బాలలతో భిక్షాటనలు చేయించే వారికి శిక్షలు తప్పవని పలు శాఖల అధికారులు హెచ్చరించారు. సోమవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, విధ్యాశాఖ, సమగ్ర శిక్షా, లేబర్ డిపార్ట్మెంట్ , పోలీసు డిపార్ట్మెంట్ ల ఆధ్వర్యంలో సంయుక్తంగా స్థానిక సామర్లకోట పట్టణం లో బెగ్గింగ్, స్ట్రీట్ చిల్డ్రన్ మరియు గుడారాలు నంధు వున్న సంచార జాతులు పిల్లలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జన సంచారం వున్న వీధులు నంధు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి, సిచ్.వెంకట్రావు, మండల విధ్యాశాఖాధికారి -2 పి.పుల్లయ్య, విధ్యాశాఖ & సమగ్ర శిక్ష ఏ.ఎల్.ఎస్ కోఆర్డినేటర్ కె.హరి కృష్ణ స్థానిక రైల్వ్ స్టేషన్, బస్ స్టేషన్ నంధు ప్రయాణికులకు, అక్కడ రైల్వే సిబ్బంధి బాలలతో అడుక్కోవడం నేరమని, పిల్లలతో బిక్షటన చేస్తే శిక్షార్హులని, బాలలకు చధువే ముద్ధు అని, యాచించ కుండ పిల్లలు చధువుకొనేలా ప్రోతహించాలని చెప్పారు.
అనంతరం, అమ్మ నమ్మ కాలనీ, సామర్ల కోట నంధు సంచార జాతుల గుడారాలను సంయుక్తంగా సందర్శించారు. సంచార జాతుల నివాసితులకు వారి పిల్లలు భవిష్యత్తు, చధువు, ప్రభుత్వ పధకాలు, ఉచిత విధ్య, పిల్లలు హక్కులు, పరిరక్షణ మరియు బాలలపై జరుగుతున్న వేధింపులు అరికట్టడం గురించి బాల్య వివాహాలు నిర్ములనపై అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ బాలలపై హింస ఎటువంటి సమస్యలు లేని బాలల స్నేహపూర్వక సమాజ నిర్మాణానికి అంతా కృషిచేయాలన్నారు. ప్రతి బాలిక బాలురకు జీవించేహక్కు అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు అభిప్రాయం తెలియజేసే హక్కు వీటిని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. అలాగే బాలల చట్టాల పై అవగాహన కల్పించారు. బాలలపై అక్రమ రవాణా, బాలలపై హింస వెంటనే జిల్లా చైల్డ్ లైన్ 1098 కి లేదా పోలీస్ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమములో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిచ్.వెంకట్రావు  చైల్డ్ వెల్ఫేర్ అధికారి జంగం సంతోష కుమారి, మండల విధ్యాశాఖాధికారి – 2 పి.పుల్లయ్య, సమగ్ర శిక్ష ఏ.ఎల్.ఎస్ కోఆర్డినేటర్ కె. హరి కృష్ణ, ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఎన్.ఐ.సి) జె.విజయ, అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యనారానాయణ, జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు, కౌన్సెలర్ దుర్గా రాణి, సామర్లకోట పోలీసు సిబ్బంధి, రైల్వే పోలీసు సిబ్బంధి, సామర్లకోట మండల విధ్యాశాఖ సి.ఆర్.పి సిబ్బంధి పాల్గొన్నారు.

➡️