పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

May 4,2024 23:35
పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

ప్రజాశక్తి – కాకినాడ, పిఠాపురం, పెద్దాపురంకాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను శనివారం ప్రారంభించారు. స్థానిక పిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు ఇతర ఎన్నికల అధికారులు ఓటింగ్‌ విధానాన్ని, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. తొలి రోజైన శనివారం పిఒ, ఎపిఒలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల ఏడో తేదీ వరకు ఓటు హక్కు ప్రక్రియ కొనసాగుతుంది.పిఠాపురంలో తొలి రోజు 443 మంది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోస్టల్‌ బ్యాలెట్‌ తొలి రోజు 443 మంది వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జెసి ఎస్‌.రామసుందర్‌ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక బిఎంఆర్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ మొత్తం ఓట్లు 2057 ఉన్నాయని, వాటిలో పోలింగ్‌ సిబ్బంది 1,726, పోలీసులు 222 అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు 109 మంది ఉన్నారన్నారు. తొలి రోజు 443 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని, ఆది, సోమవారం రెండు రోజులూ పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఉందని తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లూథరన్‌ హైస్కూల్‌లో ఆర్‌ఒ జె.సీతా రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను, పెద్దాపురం పట్టణంలో నిర్వహించిన హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4, 5 తేదీల్లో నిర్వహించే పిఒ, ఎపిఒల ఓటింగ్‌ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర సిబ్బంది 6వ తేదీలోగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. తొలుత పట్టణ పరిధిలోని గోలి వారి వీధిలో 103 సంవత్సరాల శతాధిక వృద్ధురాలు గోలి మంగాయమ్మ హోమ్‌ ఓటింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోగా కలెక్టర్‌ అభినందించారు. అనంతరం ఆయన మహారాణి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి రాయుడుపాలెం ఎపిఎస్‌పి జడ్‌పి ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ పరిశీలించారు. అనంతరం అంచ్చంపేట ఆదికవి నన్నయ యూనివర్సిటీ పిజి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్‌ నియోజకవర్గం ఇవిఎం, వివిప్యాట్స్‌ కమిషనింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేటి నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్‌ సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 18,715 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును నియోగించుకోనున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఉద్యోగుల పోలింగ్‌ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాను సక్రమంగా పరిశీలించి, ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎటువంటి రద్దీ లేకుండా ప్రణాళిక ప్రకారం 8వ తేదీ వరకు

➡️