ఆర్‌బి పట్నంలో చినరాజప్ప ప్రచారం

May 7,2024 22:29
మండలంలోని రాయభూపాలపట్నంలో

ప్రజాశక్తి – పెద్దాపురం

మండలంలోని రాయభూపాలపట్నంలో మంగళవారం టిడిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్యం ప్రసన్న, సానిపిని సురేష్‌, పెనుమర్తి దొరబాబు, నల్లల శ్రీను పాల్గొన్నారు.

➡️