మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ధర్నా

Apr 15,2024 23:09
విద్యుత్‌ షాక్‌కు గురై

ప్రజాశక్తి – పెద్దాపురం

విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబాన్ని ఆదుకో వాలంటూ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో భవన నిర్మాణ పని చేస్తుండగా విద్యు త్‌ షాక్‌కు గురై కునిశెట్టి వీర నాగేశ్వరరావు మృ తి చెందాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్థా నిక రామారావుపేటలోని కార్మిక శాఖ అధికారి కార్యాలయం వద్ద పట్టణ తాపీ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షులు గదులు నూకరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ కట్టమూరు గ్రామంలో మార్చి 23వ తేదీన భవన నిర్మాణ పనిలో ఉండగా వీర నాగేశ్వ రరావు విద్యుత్‌ షాక్‌కు గురై మర ణించాడన్నారు. కనీస మానవతా దృష్టితో కూడా ఇప్పటివరకూ కార్మికుని కుటుంబానికి ఇంటి యజమాని ఏ విధమైన ఆర్థిక సహకారం అందించకపోవడం అన్యాయమన్నారు. లేబర్‌ యాక్ట్‌ ప్రకారం పని ప్రదేశాల్లో కార్మికుల మరణాలు సంభవించినా, గాయాలకు గురైనా ఇన్సూరెన్స్‌ సౌకర్యం చేయించాలన్నారు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాన్‌ లేకుండా బిల్డింగ్‌ కడుతున్నా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి సత్య నారాయణ మూర్తిని సస్పిండు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్మిక శాఖ అధి కారి సత్యనారాయణకు వినతిపత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ బతు ్తల మురళీకృష్ణ, తోట శ్రీను, ఎర్రా రామకృష్ణ, అల్లాడ అప్పారావు, పాల్గొన్నారు.

➡️