25 వేల పోస్టులతో ‘మెగా డీఎస్సీ’

Feb 7,2024 14:50 #DSC Notification, #Kakinada
dyfi protest for mega dsc

నోటిఫికేషన్ ఇవ్వాలని డివైఎఫ్ఐ డిమాండ్ 

ప్రజాశక్తి-కాకినాడ : 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులు కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో 23 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని భర్తీ చేయడం లేదని మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ 25 వేల పోస్టులతో తీస్తామని హామీ ఇచ్చి నేడు నాలుగున్నర సంవత్సరాలు తర్వాత 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అంటే డీఎస్సీ అభ్యర్థులను మోసం చేయడమే అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసామని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం ఖాళీలు పోస్టులు భర్తీ, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇటువంటి హామీలను అమలు చేయకుండా 99 శాతం మేనిఫెస్టో ఎలా అయిందని ప్రశ్నించారు. దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురాగానే దాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి 3,4,5 తరగతులను హైస్కూల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలో ఉండే ఉపాధ్యాయ పోస్టులు అన్ని రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దగ డీఎస్సీ 6,100 వెనకకు తీసుకుని మెగా డీఎస్సీ 25 వేల తో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓ డి. నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టి. రాజా, డీఎస్సీ అభ్యర్థులు గణేష్, భవాని, రామలక్ష్మి, తులసి, రాజేష్, రామకృష్ణ, మణికంఠ, పావని, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️