వేసవి శిక్షణా తరగతుల ముగింపు

May 17,2024 22:32
వేసవి శిక్షణా తరగతుల ముగింపు

ప్రజాశక్తి-పిఠాపురం సహదయ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో రెండు వారాలుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సభకు చక్రధర్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు వెన్నపు చక్రధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 24 ఏళ్లుగా క్రమం తప్పక ప్రతి వేసవిలోనూ ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న సహృదయ మండలి సభ్యులను అభినందించారు. ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో పిఠాపురం పట్టణ పరిధిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు బాలికలను ఆయన సత్కరించారు. అనంతరం సహదయ మిత్రమండలి సభ్యులు చక్రధర రావు, గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి కొండేపూడి శంకరరావు, శిక్షణ తరగతుల ప్రిన్సిపల్‌ పోతుల శ్రీనివాసును, ఉపాధ్యాయులు కామరాజును మిత్రమండలి ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.సతీష్‌, మహిళా కార్యదర్శి పి.పావనిని ఘనంగా సత్కరించారు.శిక్షణ పొందిన 70 మంది విద్యార్థులకు భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్‌ వేణు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు, వివి,సత్యనారాయణ రెడ్డి, శ్రీకష్ణ దేవరాయలు, వరద వీరభద్రరావు, మేకా మన్మధరావు, దాడి పద్మనాభం, ఉమా మంగతాయారు, కరుణ కుమార్‌, గంగబాబు, తోట నాగేంద్ర ప్రసాద్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️