నీరు ఇప్పించండి మహాప్రభో….

Jan 8,2024 15:28 #Kakinada
farmers water problem
  • ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

ప్రజాశక్తి – కిర్లంపూడి : పిఠాపురం రూరల్ మండలంలోని గోకివాడ, జగపతి రాజ పురం రైతులు 200 ఎకరాలపైన ఆయకట్టుకు సాగునీరు రావడం లేదని ఎన్ని సార్లు కిర్లంపూడి సెక్షన్ నీటి పారుదల శాఖ అధికారులకు సమచారం ఇచ్చిన పట్టించు కోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.కిర్లంపూడి సెక్షన్ కార్యలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. ఏలేరు నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నీరు తక్కువగా ఉందని కుంటి సాకులు చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారని, నీరు విడుదల చేయకపోవడంతో భూములు బంజార భుములుగానే మిగిలాయని, ఇప్పటికే నారు వేసి 35 రోజులు అయ్యిందని దీని వలన దాల్వా మడులు ఎండిపోయాయని, ఇప్పటికైన నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తక్షణమే నీరు విడుదల చేసి దాల్వా సాగుకు రైతులకు అండగా నిలవాలని రైతు మడికి బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాసా మోషే, ఏసుబాబు, పెద్దకాపు, రామకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు.

➡️