వేట నిషేధ పరిహారం పెంచాలి

May 24,2024 23:16
వేట నిషేధ పరిహారం పెంచాలి

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న వేట నిషేధ పరిహారాన్ని రూ.20 వేలకు పెంచి అందుకోవాలని, వేట విరామ సమయంలో నిత్యావసర వస్తువులు అందించాలని ఎప మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు సిహెచ్‌.రమణి, జిల్లా నాయకులు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అమీనాబాద్‌, ఉప్పాడ, కోనపాప పేటలో శుక్రవారం వారు మత్స్య కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రూ.10,000 పరిహారం ఇచ్చి ఎంతో ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. 7,50,000మంది లబ్ధిదారులు ఉండగా గత సంవత్సరం 1,23,000 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. వేటకి వెళ్లే ప్రతి మత్స్యకారుడికి పెన్షన్‌తో ముడి పెట్టకుండా నిషేధ భతి అందించాలని రేషన్‌ కార్డులో ఇద్దరు ఉన్న వేట కెళ్లే అందరికీ భతి అందించాలని, డీజిల్‌ సబ్సిడీ రూ.20కు పెంచాలని డిమాండ్‌ చేశారు. సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు నేటికీ అనేక మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె.సింహాచలం, బడే ప్రసాద్‌, ఉప్పరపల్లి లాజర్‌, జల్లా కృపారావు, నాగేష్‌, ఓసుపల్లి రాంబాబు పాల్గొన్నారు.

➡️