వైసిపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం

Apr 15,2024 23:14
వైసిపి మండల ఎన్నికల

ప్రజాశక్తి – కోటనందూరు

వైసిపి మండల ఎన్నికల కార్యాలయాన్ని ఎంపిపి లగుడు శ్రీనివాస్‌, స్థానిక సర్పంచ్‌ గరిసింగ్‌ శివలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలన్నారు. సిఎంపై జరిగిన రాళ్లదాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు దారి లేదని అన్నారు. తుని మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ ఛైైర్మన్‌ వెలగా వెంకటకృష్ణజి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రి దాడిశెట్టి రాజా 30 వేల ఆధిక్యతతో విజయం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్‌ చింతకాయల చినబాబు, గొర్ల రామచంద్రరావు, సర్పంచులు జిగటల వీరబాబు, ఎస్‌.రాంబాబు, నల్లమిల్లి గోవిందు, వైసిపి నాయకులు సుర్ల రాజు, కురందాసు రాము, కురుప్రోలు కృష్ణ పాల్గొన్నారు.

➡️