ప్రజా మేనిఫెస్టో ఆవిష్కరణ

May 5,2024 23:07
మన పెద్దాపురం ఫేస్‌బుక్‌

ప్రజాశక్తి – పెద్దాపురం

మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ బృందం ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజక వర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, అభివృద్ధికి చేపట్టవలసిన పనులు తదితర అంశాలపై రూపొందించిన ప్రజా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. స్థానిక లెక్చరర్స్‌ కాలనీలోని రోటరీ బ్లడ్‌ బ్యాంకు సెమినార్‌ హాలులో ఈ మేనిఫెస్టో ఆవిష్కరణ జరిగింది. ఈ సంద ర్భంగా మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ అడ్మిన్‌ పెద్దిరెడ్డి నరేష్‌ మాట్లాడుతూ నియోజక వర్గంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం, అభివృద్ధికి సంబంధించి సామాన్య ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పొందుపరిచి ఈ మేనిఫెస్టో రూపొందిం చామన్నారు. ఈ మేని ఫెస్టోను పోటీలో ఉన్న కాకినాడ పార్ల మెంట్‌ అభ్యర్థులకు, పెద్దాపురం నియోజకవర్గ పోటీలో ఉన్న ఎంఎల్‌ఎ అభ్యర్థులకు అందజ ేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జోషుల కృష్ణబాబు, ఎంఆర్‌ కళాశాల విశ్రాంత అధ్యా పకులు ముస్తఫా, కెఎస్‌ఆర్‌కె.చౌదరి, నూతలపాటి అప్పలకొండ, కోరుకొండ ప్రశాంత్‌, భుజంగరావు, అల్లాడ జగదీష్‌, చింతల సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️