సచివాలయ సిబ్బంది వద్దు.. అంగన్వాడీలే కావాలి…

Dec 17,2023 16:54 #Kakinada
kkd aganwadi workers strike 6th day tallarevu

ప్రజాశక్తి – తాళ్లరేవు: అంగన్వాడీల సమ్మె కారణంగా ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం వల్ల మా చిన్నారులు కేంద్రానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదని, సచివాలయ సిబ్బంది వద్దు, అంగన్వాడీలే కావాలని విద్యార్థుల తల్లులు కాప శిరీష , రెడ్డి వెంకటలక్ష్మి, పద్మశ్రీ, మహాలక్ష్మి, లోవమ్మ తెలిపారు. సమ్మెలో భాగంగా ఆరవ రోజు దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు ఆయా కేంద్రాల తల్లులు వారి చిన్నారులతో కలసి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కేంద్రాలు నిర్వహించడం తగదని అన్నారు. మా అంగన్వాడి ఆయా, టీచరే కావాలని పిల్లలు మారాం చేస్తున్నారని వారు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

➡️