జోన్ 3 లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శనీయం

Dec 17,2023 16:13 #Kakinada
lions club services

ప్రజాశక్తి – తాళ్లరేవు: జిల్లాలోని జోన్ 3 లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శనీయమని పలువురు వక్తలు అన్నారు.కాకినాడ జిల్లా తాళ్ళరేవు లో లయన్స్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 316 బి, రీజియన్ 1, జోన్ 3 చైర్మన్ బిళ్ళకుర్తి శ్రీనివాస‌‌‌ రెడ్డి ఆధ్వర్యంలో జోన్ సోషల్ సమావేశం స్థానిక లైన్స్ క్లబ్ అధ్యక్షులు చోడే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఏ.ఎమ్.సి. చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, జిల్లా లయన్స్ ప్రతినిధులు లింగమల్లి కృష్ణమూర్తి, ఈ.వి.వి. ఈశ్వర్ కుమార్, నడింపల్లి వినోద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని పలువురు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జోన్ 3 లో గల తాళ్ళరేవు, తూరంగి, గొల్లపాలెం, వేళంగి క్లబ్ లు పోటీ తత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు ఆటపాటలతో అలరించారు. హాజరైన వారందరికీ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చోడే శ్రీనివాసరావు, నడింపల్లి వినోద్, నున్న దత్తు, సతీష్, ధూళిపూడి బాబి, భగవాన్, కృష్ణమూర్తి, రాయపరాజు, శ్రీధర్, అప్పారావు,కట్టా ఆదినారాయణ , గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️