ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎంఎల్‌ఎ సత్యప్రభ

Jun 20,2024 22:47
బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ను ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ గురు వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం హర్షనీయమన్నారు. పవన్‌ కళ్యాణ్‌ను అవహేళన చేసిన వారికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌరవమే సమాధానం అని అన్నారు. పవన్‌ నిస్వార్థం, నిజాయితీ, నిరాడంబరతను నేటి రాజకీయ నాయకులు అలవర్చుకోవాలని అన్నారు.

➡️