‘పిల్లి’ కుమారునిపై ఫిర్యాదు : నానాజీ

Jun 17,2024 22:43
మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌, కరప

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి చెప్పినా వినకుం డా వారి కుమారుడు పిల్లి కళ్యాణ్‌ కృష్ణపై టిడిపి అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్న ట్లు ఎంఎల్‌ఎ పంతం నానాజీ వెల్లడించారు. సోమవారం గోడారి గుంటలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తన విజయానికి మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, కో ఆర్డినేటర్‌ కటకంశెట్టి బాబి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్‌బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు వంటి నాయకులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. అయితే పిల్లి దంపతుల కుమారుడు పిల్లి కళ్యాణ్‌ కృష్ణ వైసిపితో చేతులు కలిపి తమకు బాధ కల్గించేలా వ్యవహరించాడని అన్నారు. తనను ఓడిస్తానని బహిరంగంగా ఛాలెంజ్‌ చేశాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో ఫొటోలు దిగి నియోజకవర్గంలో పలుచోట్ల ప్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. పార్టీ పొత్తు ధర్మాన్ని విస్మరించిన కళ్యాణ్‌ కృష్ణ తీరుపై టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

➡️