కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేదు

Apr 30,2024 23:23
కూటమి విజయాన్ని

ప్రజాశక్తి – కోటనందూరు

కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం తుని మండలం టి.తిమ్మాపురంలో టిడిపి, జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి తుని నియోజకవర్గ అభ్యర్థి యనమల దివ్య, జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. తొలుతగా పట్టణంలో వారు రోడ్డు షో నిర్వహించారు..ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఉదరు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి బలపర్చిన ప్రతీ ఒక్క అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివీద్ధి పరచడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్‌, చోడిశెట్టి గణేష్‌, కొయ్య శ్రీను, ఎస్‌ ఎల్‌ రాజు, చింతంనీడి అబ్బాయి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️