పెద్దాపురంలో పోలింగ్‌ ప్రశాంతం

May 13,2024 23:34
పెద్దాపురం నియోజక

ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురం

పెద్దాపురం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం మంద కోడిగా సాగింది. నియోజకవర్గ పరిధిలో 67 పోలింగ్‌ బూత్‌లో రాత్రి 9:00 వరకు పోలింగ్‌ జరిగిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్క్‌ పోలింగ్‌ అనంతరం ఉద యం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రక్రియను ప్రారం భించారు. అయితే చాలా కేంద్రాల్లో ఇవిఎంలు మొరాయిం చడంతో సుమారు 45 నిమిషాల నుంచి గంటపాటు ఆలస్యంగా పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. మండే ఎండలకు భయపడి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. సరైన తాగునీరు, పూర్తిస్థాయిలో టెంట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవడంతో గంటలు తరబడి ఎండలోనే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. చెదురుమదురు సంఘటన మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సామర్లకోట పట్టణంలోని సుమారు 16 పోలింగ్‌ కేంద్రాల వద్ద రాత్రి 9 గంటల వరకూ పోలింగ్‌ ప్రక్రియ కొననసాగింది. నియోజక వర్గ పరిధిలో 201 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓటర్లు స్వచందంగా అధిక సంఖ్యలో తరలి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌ ఆలస్యంతో ఇబ్బందులుఇవిఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ప్రక్రియలో ఓటుకు, ఓటుకు మధ్య 30 సెకెన్ల సమయం తీసుకుంది. అలాగే ఇవిఎం ప్యాడ్‌పై ఇచ్చిన అభ్యర్థుల గుర్తులను గుర్తించే విషయంలో వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఓటింగ్‌ ప్రక్రియ మంద కొడిగా సాగింది. నియోజక వర్గ పరిధిలో ఉద యం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన పోలింగ్‌ శాతం 50.67 శాతం మాత్రమే జరిగిం ది. నియోజవర్గ పరిధిలో ఓటింగ్‌ జరుగుతున్న తీరును కూటమి అభ్యర్థి, టిడిపి ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుమ్మల బాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు వారి వారి అనుచరులతో వచ్చి పర్యవేక్షించారు. ఎంఎల్‌ఎ చినరాజప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సామర్లకోట మండలం అచ్చంపేట 195వ బూతులో ఓటు హక్కు విని యోగించుకున్నారు. వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబు పెద్దాపురం మండలం తాటిపర్తిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామర్ల కోట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, మున్సిపల్‌ హైస్కూల్లో ఓటు హక్కును విని యోగించుకున్నారు.చెదురు మధురు ఘటనలుసమస్యాత్మక గ్రామాలుగా గుర్తిం చిన వేట్లపాలెం, పి వేమవరంలో చెదురు మాదురు ఘటనలు జరిగాయి. స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. పి వేమవరంలో వైసిపి అభ్యర్థి దొరబాబుతోపాటు అనుచరులు పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లడానికి ప్రయత్నించడాన్ని టిడిపి నాయ కులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. పోలీ సులు రంగ ప్రవేశం చేసి ఇది వర్గాలను అదుపు లోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రాల భద్రతా ఏర్పా ట్లను పెద్దాపురం డిఎస్‌పి లతా కుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.

➡️